వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వం కార్మిక వ్యతిరేక తీరుకు... వీరభద్రయ్య గత రెండు రోజులుగా మనోవేదనతో గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వీరభద్రయ్య మృత దేహంతో ఆర్టీసీ కార్మికులు పరిగి డిపోలోకి చొచ్చుకెళ్లారు. పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా... కార్మికులు డిపోలోనే బైఠాయించారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీర భద్రయ్య మృతితో తాము రోడ్డున పడ్డామని... ప్రభుత్వమే ఆదుకోవాలని మృతుడి తల్లి కోరారు.
ఇవీ చూడండి : హైకోర్టు తీర్పు తర్వాతే... ఆర్టీసీపై తుది నిర్ణయం