ETV Bharat / state

బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ గ్రామస్థుల నిరసన - తెలంగాణ వార్తలు

రాపోల్ గ్రామంలో రోడ్డు సరిగా లేకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు వాపోయారు. అదనంగా 8కి.మీ వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు.

rapole-villagers-protest-for-bridge-on-shadnagar-pargi-road-in-vikarabad-district
బ్రిడ్జి నిర్మించాలని రాపోల్ గ్రామస్థుల నిరసన
author img

By

Published : Jan 17, 2021, 11:33 AM IST

వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్​ గ్రామంలో బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ షాద్​నగర్-పరిగి ప్రధాన రహదారిపై గ్రామస్థులు బైఠాయించారు. పొలాలకు వెళ్లాల్సిన రోడ్డు సరిగా లేదని... ఏ కాలంలోనైనా బురదగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు సరిగా లేనందున 8 కి.మీ అదనంగా వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. అధికారులు స్పందించి ఆ దారిలో బ్రిడ్జి నిర్మించాలని కోరారు.

బ్రిడ్జి విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఎవరూ స్పందించలేదని వాపోయారు. పోలీసులు సంఘటనా స్థలికి వచ్చి... ఆందోళనాకారులను అరెస్ట్ చేశారు.

ఇదీ చదవండి: మేక మాంసం మరింత ప్రియం.. కిలో రూ. 750

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.