ETV Bharat / state

ప్రైవేట్ ఆస్పత్రుల ఇష్టారాజ్యం.. పట్టించుకోని యంత్రాంగం - private hospitals looting people in telangana

ఓవైపు కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే.. దొరికిందే సందు అన్నట్లు కొన్ని ప్రైవేట్ దవాఖాను ప్రజలను దోచుకుంటున్నాయి. సాధారణ జలుబు, దగ్గుతో దవాఖానాకు వచ్చిన వారికి అనుమతి లేకుండా కరోనా పరీక్ష చేసి.. చికిత్స పేరిట లక్షలు జేబులో వేసుకుంటున్నాయి.

private hospitals, private hospitals  looting people
ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రైవేట్ ఆస్పత్రుల దందా, ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ
author img

By

Published : May 20, 2021, 10:14 AM IST

  • పరిగి పట్టణంలోని ఓ ప్రైవేటు డయాగ్నోస్టిక్‌ కేంద్రంలో అనుమతులు లేకుండా కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక పరీక్షకు గతంలో రూ.3 వేలు తీసుకునేవారు. ప్రజలు ప్రశ్నించడంతో, విషయం ఎక్కడ బయటపడుతుందోనని ప్రస్తుతం రూ.వెయ్యికే పరీక్షలు చేపడుతున్నారు.
  • వికారాబాద్‌ మండలానికి చెందిన ఓ వ్యక్తి కొవిడ్‌ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. వెంటనే చికిత్సకు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి వివిధ పరీక్షలు చేసి అక్కడి వైద్యుడు రూ.4 వేల మందులు రాసి వాడమని సూచించారు. ఒక్క పూటలో అన్ని కలిపి రూ.14 వేలకుపైగా ఖర్చయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. తీరా చూస్తే ఈ ఆసుపత్రికి కరోనా వైద్యం చేయడానికి అనుమతులు లేవని తేలింది.

కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే.. అందివచ్చిన అవకాశాన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. వికారాబాద్ జిల్లాలో నెల రోజులుగా పరీక్షల సంఖ్య 60 శాతం తగ్గించారు. అదే సమయంలో టీకా నాలుగు రోజులుగా నిలిచిపోయింది. ఏ మాత్రం జలుబు, జ్వరం, తలనొప్పి, ఇతర లక్షణాలు కనిపించినా ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు పరిగెడుతున్నారు. అక్కడ అనుమతులు ఉన్నా.. లేకున్నా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. చికిత్స సైతం అందిస్తూ.. రూ.వేలల్లో బిల్లులు వేస్తున్నారు. వైద్యారోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడడం వల్ల అనుమతి తీసుకోకుండానే డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు, ఆసుపత్రులు కొనసాగిస్తూ పేదల వద్ద దండుకుంటున్నారు.

సామాన్యులపై ప్రభావం

జిల్లాలో 28 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు చేస్తున్నారు. ప్రైవేట్‌లో మహవీర్‌ ఆసుపత్రికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజుకు వంద, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 200, జిల్లా ఆసుపత్రిలో 300 పరీక్షలు చేయాలన్నది లక్ష్యం. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రి మినహా మిగతా అన్ని ఆసుపత్రుల్లోనూ 50 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో పాజిటివ్‌ రేటు దాదాపు 30 శాతంగా ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ పరిణామాలు సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.

అనుమతిలేకుండా.. అనవసర పరీక్షలు

పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే ఈ రోజు కోటా అయిపోయాయి. రేపు రండని చెబుతున్నారు. ఉదయం 7 గంటలకు వెళ్లి వరుసలో నిలుచుంటే, పరీక్షలు పూర్తయ్యే సరికి మధ్యాహ్నం 12 గంటలు దాటిపోతోంది. మౌలిక సదుపాయాలు అంతంతగానే ఉంటున్నాయి. దీంతో అక్కడకు వెళ్లి వేచి చూడటం, ఎవరికైనా పాజిటివ్‌ ఉంటే మనకూ సోకే ప్రమాదం ఉందని మధ్యతరగతి, ఆపైన కుటుంబాలు, ఆర్థిక స్థోమత ఉన్న వారు ప్రైవేటు ఆసుపత్రులకు వరుస కడుతున్నారు. 15 ప్రైవేట్‌ ఆసుపత్రులకు మాత్రమే చికిత్సకు అనుమతి ఉన్నా, మిగతా ప్రైవేట్‌ ఆసుపత్రులూ సేవలందిస్తామంటూ వచ్చిన వారిని వచ్చినట్లు చేర్చుకుంటున్నారు. పాజిటివ్‌ వస్తే వెంటనే సిటీ స్కాన్‌ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆపై బెడ్‌ ఛార్జీలు రోజుకు రూ.పది వేల వరకు వేస్తున్నారని బాధితులు పేర్కొంటున్నారు. వికారాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో రోజుకు రూ.30 వేలు తీసుకుంటున్నారని సమాచారం.

సేవలపై గందరగోళం :

వికారాబాద్‌లోని కొన్ని ఆసుపత్రుల్లో రోగి వద్దకు సహాయకులను రావద్దంటున్నారు. అన్నీ మేమే చూసుకుంటుమని చెబుతున్నారని, బాధితుల బంధువులు చెబుతున్నారు. కనీసం ఒక్కరినైనా అనుమతించాలని, వారి బాగోగులు, ఆహారం, ఇతర అత్యవసర పరిస్థితిలో తోడుగా ఉండే వీలుంటుందంటున్నారు. రూ.వేలల్లో ఫీజులు తీసుకుంటున్నారు. సేవలు మాత్రం అధ్వానంగా ఉంటున్నాయని ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదని ఆరోపిస్తున్నారు.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

అనుమతులు లేకుండా పరీక్షలు చేయడం, చికిత్సలు అందించడం చట్టవిరుద్ధం. ఫిర్యాదు చేస్తే దాడులు నిర్వహిస్తాం. నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే పరిశీలించి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.

- సుధాకర్‌ షిండే, జిల్లా వైద్యాధికారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.