వికారాబాద్ జిల్లా దోమ మండలం బొంపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుఘాతానికి గురై జాకీర్ (21)అనే యువకుడు మృతి చెందాడు. జాకీర్ కుటుంబ సభ్యులు గ్రామంలో నూతన భవనం నిర్మిస్తున్నారు. ఆ భవనానికి అతి సమీపంలో హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉన్నాయి.
నూతనంగా నిర్మిస్తున్న భవనానికి జాకీర్ పైప్‌తో నీళ్లు పడుతుండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తగిలి ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై జాకీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీనితో జాకీర్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇవీచూడండి: తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రతిభ.. 9 వేలతో బ్యాటరీ సైకిల్