ETV Bharat / state

వికారాబాద్​లో గుర్తు తెలియని మహిళ దారుణ హత్య

ఓ మహిళను హత్య చేసి ఆపై నిప్పంటించిన ఘటన వికారాబాద్​ జిల్లా పరిగిలో చోటుచేసుకుంది. హైదరాబాద్​ నుంచి బీజాపూర్​ వెళ్లే దారిలో ఈ తెల్లవారు జామున కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వికారాబాద్​లో గుర్తు తెలియని మహిళ దారుణ హత్య
author img

By

Published : Sep 5, 2019, 7:01 PM IST

వికారాబాద్​ జిల్లా పరిగిలో దారుణం జరిగింది. గుర్తుతెలియని మహిళను హత్య చేసిన దుండగులు మృతదేహాన్ని తగలబెట్టారు. హైదరాబాద్​ నుంచి బీజాపూర్​ వెళ్లే రహదారిలో రంగంపల్లి గేటు వద్ద బుధవారం తెల్లవారు జామున పూర్తిగా కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్​ టీం, డాగ్​ స్క్వాడ్​తో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. మృతదేహాలను తగలబెట్టేందుకు వాడిన పెట్రోల్​ బాటిల్​ దొరికింది. ఘటనా స్థలిని పరిశీలించిన పరిగి డీఎస్పీ రవీందర్​ రెడ్డి విచారణ చేపట్టారు. మహిళ ఎవరు, హత్య ఎక్కడ జరిగింది, ఎవరు చేసుంటారు సహా పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

వికారాబాద్​లో గుర్తు తెలియని మహిళ దారుణ హత్య

ఇదీ చూడండి: సతీశ్​ బాబు హత్య కేసును ఛేదించిన పోలీసులు

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.