ETV Bharat / state

'ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తాం' - lates news on mlc Mahendar Reddy

రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఎమ్మెల్సీ మహేందర్​రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్​ జిల్లా తాండూరులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

mlc Mahendar Reddy opend crop buying centre
ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తాం: మహేందర్​రెడ్డి
author img

By

Published : May 2, 2020, 11:49 AM IST

రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని ఎమ్మెల్సీ మహేందర్​రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం బెల్కటూర్​లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని మహేందర్​రెడ్డి పేర్కొన్నారు. దళారుల బెడద నుంచి రైతులను కాపాడుకోవటానికే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు.

మరోవైపు తాండూర్ మండలంలోని మల్రెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాండూర్​ పురపాలక సంఘం అధ్యక్షురాలు తాటికొండ స్వప్న ప్రారంభించారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు కాకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని ఆమె సూచించారు.

ఇవీచూడండి: దేశవ్యాప్తంగా 35వేలు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.