ETV Bharat / state

పట్టభద్రుల ఎన్నికలపై ఎమ్మెల్యే పట్నం అవగాహన కార్యక్రమం - graduate mlc election news

వికారాబాద్​ జిల్లా కొడంగల్​లో ప్రజాప్రతినిధులు, యువకులకు పట్టభద్రుల ఎన్నికలపై అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ పట్టభద్రుల ఓటు హక్కులో పేర్లను నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్​రెడ్డి తెలిపారు.

awareness on graduate mlc elections in kodangal
పట్టభద్రుల ఎన్నికలపై ఎమ్మెల్యే పట్నం అవగాహన కార్యక్రమం
author img

By

Published : Sep 28, 2020, 3:52 PM IST

2017 కంటే ముందు డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన ప్రతి ఒక్కరూ పట్టభద్రుల ఓటు హక్కులో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్​రెడ్డి సూచించారు. వికారాబాద్​ జిల్లా కొడంగల్​లో ప్రజాప్రతినిధులు, యువకులకు పట్టభద్రుల ఎన్నికలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు కావాల్సిన ఫారంలను తహసీల్దార్​ కార్యాలయం, మీ సేవ కేంద్రంలో తీసుకుని పేర్లు నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే వివరించారు. గ్రామాల్లో ఉన్న పట్టభద్రులు ఓటు నమోదు చేసుకునేలా ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలని సూచించారు.

పనులు వేగవంతం చేయాలి

గ్రామాల్లో చేపడుతున్న వైకుంఠధామం నిర్మాణాలు, రైతు వేదిక భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అన్నారు. నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ ఈ నెల 30న కొడంగల్​ పట్టణంలో నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి తమ గ్రామాల నుంచి ట్రాక్టర్లను తీసుకొచ్చి ర్యాలీని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండిః వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.