వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బషీరాబాద్ మండలానికి చెందిన 15ఏళ్ల బాలికకు కుటుంబ సభ్యులు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
సోమవారం అర్ధరాత్రి ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో బాలికకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యలు ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ