ETV Bharat / state

తెరాస అనేది తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష : హరీశ్ రావు

పీవీ నర్సింహరావు కుమార్తె.. సురభి వాణిదేవి పేరు ప్రకటించిన నాడే తెరాస గెలుపు ఖాయమైందని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. వికారాబాద్​ జిల్లాలోని ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

minister harish rao campaign at vikarabad on mlc election
తెరాస అనేది తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష : హరీశ్ రావు
author img

By

Published : Feb 28, 2021, 8:06 PM IST

వికారాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్... సురభి వాణిదేవి పేరు ప్రకటించిన నాడే మన గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. తన విద్యా సంస్థల ద్వారా వేల మంది విద్యావంతులను సమాజానికి అందించారన్నారు.

తెరాసను గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. మంచి మెజారిటీ కోసం కార్యకర్తలందరూ కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. తెరాస పార్టీ అనేది రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్ష అని తెలిపారు.

తెలంగాణ పథకాలను కేంద్రమంత్రులే ప్రశంసించారు.. కానీ గల్లీలోని భాజపా లీడర్లు మాత్రం విమర్శిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతుక అంటున్న నేతలు... గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన కేంద్రాన్ని ప్రశ్నించండని వ్యాఖ్యానించారు.

తెరాస అనేది తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష : హరీశ్ రావు

ఇదీ చూడండి: 'భాజపా ఏం చేసిందని ఓటు వేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.