ETV Bharat / state

విద్యుదాఘాతంతో వలస కూలీ మృతి - crim news in thandur

వికారాబాద్ జిల్లా తాండూర్​లో విషాదం నెలకొంది. అల్లాపూర్​ శివారులో ఓ పాలిష్​ యూనిట్​లో పనిచేస్తున్న వలసకూలీ... ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

migrant died with current shock in thandur mandal
విద్యుదాఘాతంతో వలస కూలీ మృతి
author img

By

Published : May 17, 2020, 1:52 PM IST

విద్యుదాఘాతంతో ఓ వలస కూలి మరణించిన ఘటన వికారాబాద్​ జిల్లా తాండూర్​లో చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన రమేశ్​ సింగ్(40) మండల పరిధిలోని అల్లాపూర్ శివారులో ఓ పాలిష్ యూనిట్​లో కూలిగా పనిచేస్తున్నాడు. నాపరాయి పాలిష్ చేసిన తర్వాత వెలువడే వ్యర్థాలను తొలగించేందుకు ట్యాంకర్​ను తీసుకొచ్చాడు.

వ్యర్థాన్ని పైపు ద్వారా ట్యాంకులో నింపడానికి రమేశ్​ ఉపక్రమించాడు. ఈ క్రమంలో పైపులు పైకెత్తాడు. అతని మీదనే విద్యుత్ తీగలు ఉన్నాయని గుర్తించలేక పోయాడు. రమేశ్​ చేతిలో ఉన్న పైపు విద్యుత్ తీగలకు తాకగా... షాక్​ తగిలింది. ట్యాంకర్​పై నుంచి రమేశ్​ కింద పడిపోవటంతోనే... తోటి కూలీలు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు... రమేశ్​ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: శంషాబాద్​ వైపు వెళ్లిన చిరుత.. కొనసాగుతున్న వేట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.