వాతావరణానికి కీడు చేయని మట్టి వినాయకులను ప్రతిష్టించుకోవాలని స్థానిక ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వెనుకబడిన తరగతుల శాఖ ప్రోత్సాహంతో శాతవాహనులు తయారు చేసిన మట్టి వినాయకుల స్టాల్‌ను ఆయన కలెక్టర్ అయేషాతో కలిసి ప్రారంభించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను వాడడం వల్ల ప్రకృతి వినాశనం చెందుతుందని పేర్కొన్నారు. అందరు ప్రశాంతంగా ఉండాలంటే ప్రకృతికి కీడు చేయని మట్టి వినాయకులను జిల్లా వ్యాప్తంగా ప్రతిష్ఠించాలని సూచించారు.
ఇదీచూడండి:పుతిన్, జిన్‌పింగ్‌కు వచ్చిన అవార్డు ఇప్పుడు మోదీకీ...