వికారాబాద్ జిల్లాలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శాసనసభ ఉపసభాపతి పద్మారావు జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకు ముందు మొక్కను నాటారు. జిల్లా కోర్టు అవరణలో సీనియర్ జడ్జి డానియల్ రూత్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, గాంధీ పార్కు, ఎన్నెపల్లి చౌరాస్తాలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ జాతీయ జెండాను అవిష్కరించారు.
జడ్పీ కార్యాలయంలో ఛైర్పర్సన్ సునీతారెడ్డి, జిల్లా పోలీస్ కార్యాలయం ముందు ఎస్పీ నారాయణలు జాతీయ జెండాను ఎగురవేశారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో జడ్పీ ఛైర్పర్సన్ సునీతారెడ్డి , కలెక్టర్ పౌసుమిబసు, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్ , మహేష్ రెడ్డి, కాలె యాదయ్యలు, జిల్లా పోలీస్ అధికారి నారాయణ, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: స్వాతంత్య్ర వేడుకల్లో జెండావిష్కరించిన మంత్రి ఈటల