heavy rain in vikarabad: వికారాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా జిల్లాలోని తాండూర్, వికారాబాద్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆయా మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంటలు నీట మునిగాయి. జిల్లాలోని అతిపెద్ద ప్రాజెక్టు కోటిపల్లి నిండుకుండలా మారింది. ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు అలుగు ద్వారా కిందకు పారుతోంది.
వికారాబాద్ పట్టణానికి తాగునీరు అందించే శివసాగర్.. పూర్తిగా నిండిపోయింది. జిల్లాలోని మిగతా ప్రాజెక్టులూ జలకళను సంతరించుకున్నాయి. వరద నీటితో బాచారం, నాగసముందర్, దోర్నాల, ఘాజీపూర్, కోకట్ వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఆయా మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులు కొడంగల్- పరిగి మీదుగా వెళ్తున్నాయి.