ETV Bharat / state

వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం.. ఉప్పొంగిన వాగులు - వికారాబాద్ జిల్లా వార్తలు

నాలుగు రోజులుగా వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు... కాగ్నానది, కోకట్ వాగు వరద నీటితో నిండిపోయాయి. పలు చోట్ల రోడ్డు మార్గాలు తెగిపోయి... రాకపోకలు స్తంభించిపోయాయి. పంటలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి.

heavy-rain-in-vikarabad-district
వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం.. ఉప్పొంగిన వాగులు
author img

By

Published : Sep 18, 2020, 9:20 AM IST

వికారాబాద్ జిల్లా తాండూరులో ఉదయం నుంచే భారీగా వర్షం కురుస్తోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. కాగ్నానది, కోకట్ వాగు వరద నీటితో నిండి పొంగిపొర్లుతున్నాయి.

వర్షం కారణంగా థరూర్ మండలం, పెద్దేముల్ మండలం మన్సాన్​పల్లి రోడ్డు మార్గాలు తెగిపోయాయి. దీంతో హైదరాబాద్​కు వెళ్లే మార్గంలో రాకపోకలు స్తంభించిపోయాయి. తాండూర్ నుంచి కొడంగల్ మీదుగా హైదరాబాద్​కు రాకపోకలు కొనసాగిస్తున్నారు.

వర్షం ప్రభావంతో పంటలు నీట మునిగాయి. ఇప్పటికే పత్తి, కంది పంటలు పాడైపోయాయి. పొలాలన్నీ వర్షం నీటితో నిండిపోవడంతో... చెరువులను తలపిస్తున్నాయి.

ఇదీ చూడండి: జోరు తగ్గని వానలు.. వేల ఎకరాల్లో పంట నష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.