వికారాబాద్ జిల్లాలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు ఉరకలెత్తుతున్నాయి. చేవెళ్ల మండల పరిధిలోని దేవరంపల్లి గ్రామంలో గల ఈసీ వాగు పొంగిపొర్లుతోంది. ఫలితంగా హిమాయత్ సాగర్ చెరువుకు వరద పోటెత్తింది.
చాలా రోజుల తర్వాత వాగు పొంగుతుండటం వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వాగును చూసేందుకు తరలివచ్చారు. వర్షాకాలం సీజన్ ప్రారంభంలోనే భారీ వర్షాలు పడుతుండటం వల్ల రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచూడండి: జేఈఈ, నీట్ నిర్వహణపై ఉత్కంఠ... నేడు స్పష్టత వచ్చే అవకాశం