ETV Bharat / state

తాండూరులో వర్ష బీభత్సం... చెరువులను తలపిస్తున్న రోడ్లు - తాండూరులో భారీగా కురిసిన వర్షం

వికారాబాద్ జిల్లా తాండూరులో బుధవారం వర్షం బీభత్సం సృష్టించింది. ప్రధాన రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. రోడ్లపై పడిన గుంతల్లో వాహనాలు ఇరుక్కుపోయాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పార్కులు చెరువులను తలపిస్తున్నాయి.

heavy rain fall in tandur town vikarabad distric
తాండూరులో వర్ష బీభత్సం... చెరువులను తలపిస్తున్న రోడ్లు
author img

By

Published : Jul 16, 2020, 10:58 AM IST

వికారాబాద్ జిల్లా తాండూరులో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఏకదాటిగా కురిసిన భారీ వర్షానికి రోడ్లు వాగులను తలపిస్తున్నాయి. స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నియోజకవర్గం పర్యటనకు వచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం అవస్థలు పడారు.

హైదరాబాద్ తాండూర్ మార్గంలోని రోడ్డుపై వరద నీరు భారీగా ప్రవహించింది. కొన్ని కార్లు వరద నీటిలో ఇరుక్కుపోయాయి. స్థానిక యువకుల సహకారంతో వాటిని బయటకు తీశారు.

తాండూర్ సమీపంలోని వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తూ.. పొంగిపొర్లాయి. ప్రధాన రోడ్లు పూర్తిగా దెబ్బతినడం వల్ల రోడ్ల మీద రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పార్కులు వర్షపు నీటితో చెరువులను తలపిస్తున్నాయి.

ఇదీ చూడండి: భాగ్యనగరంలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.