వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిసరాల గ్రామాలలో భారీ ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. ఈ వర్షంతో మండలంలోని వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా నాశనమయ్యాయి.
రెండు రోజుల క్రితం పూడూరు మండలంలో పడిన భారీ వర్షంతో అక్కడి పంటలు సైతం నీట మునిగి పాడైపోయాయి. చేతికొచ్చిన పంట నాశనవవడంతో అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని సూచిస్తున్నారు.
ఇవీ చూడండి: నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం