బతుకుదెరువు కోసం వికారాబాద్ జిల్లాకు చెందిన కొందరు మహారాష్ట్రలోని ముంబయి, పూణె ప్రాంతాలకు వెళ్లారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో వారంతా తమ స్వస్థలాలకు చేరుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి వలస కూలీల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను ఆరా తీశారు. వారికి నిత్యావసర సరకులను అందజేశారు. కూలీలంతా 14 రోజుల పాటు హోంక్వారంటైన్లో ఉండాలని, వైద్యుల సూచనలు తప్పకుండా పాటించాలని సూచించారు.