వికారాబాద్ జిల్లా పరిగిలోని అంబేడ్కర్ నగర్, ప్రేమ్‌నగర్ కాలనీల్లో పేదలకు డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. సోనియా గాంధీ పిలుపు మేరకు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో పేదలను ఆదుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన తెలిపారు. కరోనా కట్టడికి ప్రజలు సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి: సర్కార్ 'లిక్కర్ పాసుల' నిర్ణయంపై హైకోర్టు స్టే