పోలీసు ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న యువత ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని... వికారాబాద్ జిల్లా పరిగి సీఐ లక్ష్మీరెడ్డి తెలిపారు. ఉచిత శిక్షణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అర్హత పరీక్షను ఆయన పరిశీలించారు. ఆర్థిక స్తోమత లేని నిరుద్యోగులకు 2 ఏళ్లుగా ఉచితంగా శిక్షణ ఇస్తున్న ఐదుగురు యువకులను సీఐ అభినందించారు.
2018లో దాదాపు 130 మంది యువతీ, యువకులకు ఉచితంగా శిక్షణ ఇచ్చినట్లు నిర్వాహకులు సంతోశ్ తెలిపారు. వారిలో 30 మంది కానిస్టేబుల్, ఎస్సైలుగా ఉద్యోగం సాధించారని అన్నారు. ఈ ఏడాది కూడా 300 మందికి శిక్షణ ఇచ్చేందుకు పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. తనతో పాటు నలుగురు మిత్రులు కలిసి ఉచితంగా శిక్షణ ఇస్తూ సమాజ హితం కోసం పని చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. సందడిగా ఆలయ పరిసరాలు