వికారాబాద్ పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీలోని భవానిమాతా ఆలయం నుంచి వందలాది మంది భక్తులతో కలిసి నవాబుపేట ప్రభునగర్లోని మాణిక్ ప్రభు ఆశ్రమ పీఠాధిపతి శ్రీ బాలమార్తాండ్ మహరాజ్ పాదయాత్ర ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ కోసం శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయం చుట్టు అనంతగిరి ప్రదక్షిణ పేరుతో ఈ ఆధ్యాత్మిక యాత్ర నిర్వహిస్తున్నారు. అనంతగిరి కొండ చుట్టూ 22 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేస్తున్నారు.
గోదుమగూడ గ్రామంలోని భక్తులు బాలమార్తాండ్ స్వామీజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికి పాదపూజలు నిర్వహించారు. వికారాబాద్, చేవెళ్ల ఎమ్మెల్యేలు ఆనంద్, యాదయ్య, న్యాయవాది గోపాల్‌రెడ్డిలు ఈ యాత్రలో పాల్గొన్నారు.
గిరి, ఝరీ ప్రదక్షిణ అనేది అనేక ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉందని భక్తులు తెలిపారు. గంగా, మానససరోవరం, గోవర్ధనగిరి, అరుణాచలగిరి ప్రదక్షిణలు ప్రాచుర్యంలో ఉన్నాయని చెప్పారు.
ఇదీ చూడండి: కృష్ణమ్మ ఒడికి చేరిన 'దిశ'