వికారాబాద్ జిల్లా పరిగి డీసీఎంస్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ వద్ద మక్కలు కొనుగోలు చేయకుండా.. దళారుల వద్ద తీసుకుంటున్నారని రైతులు మండిపడ్డారు.
కొనుగోలు కేంద్రం సిబ్బందితో వాగ్వాదానికి దిగి కొనుగోలును నిలిపివేశారు. ఈ నేపథ్యంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిబంధనల ప్రకారం కొనుగోలు చేసేవరకు కదిలేది లేదని మొండికేశారు.
మొక్క జొన్నలు కొనుగోలు కేంద్రానికి తెచ్చేందుకు సంచులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. రేపు మాపు అంటూ తిప్పుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పద్ధతి ప్రకారం మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని.. దళారులతో చేతులు కలిపిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను రైతులు కోరారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో కొత్తగా 509 కరోనా కేసులు, 3 మరణాలు