వికారాబాద్ జిల్లా ధారూరు మండలం కెరెల్లి గ్రామానికి చెందిన చంద్రారెడ్డి అనే వ్యక్తి తాను కొత్తగా ఇంటిని నిర్మిస్తున్నాడు. ఈ రోజు ఇంటికి స్లాబ్ వేస్తుండగా పక్కనే ఉన్న 11కేవీ విద్యుత్ తీగలు తగిలి చంద్రారెడ్డితో పాటు స్లాబ్ వేయడానికి కూలికి వచ్చిన సురేష్ అనే వ్యక్తికి విద్యుత్ షాక్ తగిలి తీవ్రగాయాలయ్యాయి. వారిలో వికారాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు.
ఇదీ చదవండి: 'జీ7కు భారత్ సహజ భాగస్వామి'