ETV Bharat / state

CPM: ఇళ్ల జాగా కోసం సీపీఎం ఆందోళన.. పోలీసులతో తీవ్ర వాగ్వాదం - cpm latest news

CPM: వికారాబాద్ జిల్లాలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రంగాపూర్ గ్రామం శివారులోని ప్రభుత్వ భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

సీపీఎం
సీపీఎం
author img

By

Published : Jul 31, 2022, 5:38 PM IST

CPM: వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్‌ గ్రామంలో సీపీఎం ఆందోళన చేపట్టింది. గ్రామ శివారులోనిలో సర్వేనెంబర్ 18లోని ప్రభుత్వ భూమిని ప్రైవేటు ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారంటూ నిరసన వ్యక్తం చేశారు. ఆ భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల కోసం అక్కడి పేదలు ఎవరికి తోచినట్లుగా వారు కర్రలు.. చీరలు కట్టి అక్కడే కూర్చున్నారు.

ఈ క్రమంలో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిగి తహసీల్దార్‌ నిరసనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అందుకు వారు నిరాకరించడంతో పోలీసులు వారిని బలవంతంగా పోలీస్​స్టేషన్​కు తరలించారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉందని తీర్పు వచ్చాక తదుపరి విషయం చర్చిస్తామని తహాసీల్దార్‌ తెలిపారు.

ఇవీ చదవండి: కలెక్టర్ల కోసం ఎదురుచూస్తున్న హైదరాబాద్‌ సహా నాలుగు జిల్లాలు

చెక్ బౌన్స్ కేసులో ధోనీకి ఊరట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.