అన్యాక్రాంతమైన భూదాన్ భూములను స్వాధీనం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్‌కు సీపీఎం నేతలు విజ్ఞప్తి చేశారు. పరిగి మండలం నారాయణపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో మొత్తం 32.22 ఎకరాల భూదాన్ భూమిని స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
32 ఎకరాల భూదాన్ భూమిలో 9 ఎకరాల 15 గుంటలు సుగుణ స్టీల్ కంపెనీ యాజమాన్యం ఆక్రమించుకున్నట్లు సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటయ్య ఆరోపించారు. మిగతా భూమిని హైదరాబాద్‌కు చెందిన బగ్గా వైన్స్ యాజమాన్యం ఆక్రమించుకున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే ఈ భూమిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:కోహ్లీ కోసం బయోబబుల్ నిబంధనలు బ్రేక్