ధాన్యం అంతా కొంటామని.. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని పౌరసరఫరాల శాఖ వికారాబాద్ జిల్లా మేనేజర్ విమల తెలిపారు. తాండూరు మండలం చెంగోల్, బెల్కటూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను విమల పరిశీలించారు. కేంద్రాల వద్ద పేరుకుపోయిన ధాన్యం నిల్వలను 2 రోజుల్లో పూర్తి స్థాయిలో రైస్ మిల్లులకు తరలిస్తామని హామీ ఇచ్చారు.
రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడానికి ఇది వరకు ఓకే గుత్తేదారుకు టెండర్ అప్పగించామని... తాజాగా ఇంకొకరికి అప్పగించినట్లు వివరించారు. రోజుకు పదిహేను లారీల్లో ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలిస్తామని తెలిపారు. లాక్డౌన్ అమలవుతున్న తరుణంలో ధాన్యం తరలించడానికి కొంత అంతరాయం ఏర్పడిందని... ఇకనుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని విమల తెలిపారు.