వికారాబాద్‌లో కారు బీభత్సం సృష్టించింది. పోలీసు శిక్షణ కేంద్రం సమీపంలో ద్విచక్రవాహనంను ఢీకొట్టింది. వాహనదారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు కలెక్టర్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న నగేష్‌గా పోలీసులు గుర్తించారు. నగేష్ కుటుంబాన్ని జాయింట్ కలెక్టర్ అరుణాకుమారి పరామర్శించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.