ETV Bharat / state

మిషన్​ భగీరథ పైపులైన్​ గుంతలో పడి బాలుడు మృతి

వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మిషన్ భగీరథ పైప్​లైన్ కోసం తవ్విన గుంతలో పడి చంద్రశేఖర్ అనే ఏడు సంవత్సరాల బాలుడు మృతి చెందాడు.

Boy Died Accidentally Slipped In Mission Bhageeratha Pipe Line
మిషన్​ భగీరథ పైపులైన్​ గుంతలో పడి బాలుడు మృతి
author img

By

Published : Jun 27, 2020, 8:54 AM IST

వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామంలో ఏడేళ్ల బాలుడు మిషన్​ భగీరథ పైప్​లైన్​ గుంతలో పడి మృతి చెందాడు. గ్రామానికి చెందిన వడ్డే వెంకటమ్మ, అనంతయ్యల ఏకైక కుమారుడు ప్రకాష్. ఉపాధి నిమిత్తం వెంకటమ్మ, అనంతయ్యలు హైదరాబాద్​లో ఉంటారు.

ప్రకాష్​ నానమ్మ దగ్గర ఉంటూ చదువుకుంటున్నాడు. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు మిషన్​ భగీరథ పైప్​లైన్​ కోసం తవ్విన గుంతలో పడ్డాడు. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలో నీళ్లు ఉండడం వల్ల మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు.

ఇదీ చదవండి:వారికి స్మార్ట్​ఫోన్లే లేవ్- మరి ఆన్​లైన్​లో చదువెలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.