వికారాబాద్ జిల్లా తాండూరులో శ్రీ భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 23న ప్రారంభమైన ఈ జాతర మే 1 వరకు కొనసాగుతుంది. ప్రతి రోజు స్వామివారిని పురవీధుల్లో ఊరేగిస్తున్నారు. ఊరేగింపులో డప్పు దరువుల విన్యాసాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. శనివారం లంకా దహనం నిర్వహిస్తారు. ఈ జాతరకు మహబూబ్నగర్, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలతో పాటు సరిహద్దు రాష్ట్రం కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలివస్తారని నిర్వాహకులు తెలిపారు.
ఇవీ చూడండి: ఇంటర్ అవకతవకలపై నివేదిక సిద్ధం... మిగిలింది చర్యలే