తాండూర్‌లో ఆర్డబ్ల్యూఎస్ విభాగంలో గురువయ్య అనే గుత్తేదారుకు 22లక్షల బిల్లులు రావాల్సి ఉంది. వీటిని మంజూరు చేసేందుకు డీఈ శ్రీనివాస్ 30వేలు లంచం డిమాండ్ చేశాడు. డబ్బులిస్తేనే పనవుతుందని తేల్చిచెప్పాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేదని గురువయ్య.. ఏసీబీని ఆశ్రయించారు. వారి సూచన మేరకు డీఈ అడిగిన డబ్బులు ఇవ్వడానికి గుత్తేదారు అంగీకరించాడు. డబ్బులను వర్క్ ఇన్స్పెక్టర్ మహేందర్‌కు ఇవ్వాలని డీఈ సూచించాడు. అప్పటికే నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు... మహేందర్‌కు డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నారు. డీఈ శ్రీనివాస్‌తో పాటు మహేందర్‌పై కూడా కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.
ఇదీ చూడండి: 'సీఎంకు పంపినవి రసాయనాల సీసాలు కావు... మురుగునీరే'