మరోవైపు మాజీమంత్రి జోగురామన్న అనుచరులు సైతం నిరసన గళం వినిపించారు. ఆదిలాబాద్ లో జనగం దంపతులు తమ పదవులను త్యజించారు. తెరాస జిల్లా ఉపాధ్యక్ష పదవి నుంచి జనగం సంతోష్, ఆయన సతీమణి సంగీత మున్సిపల్ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు.
తెరాస కౌన్సిలర్ల రాజీనామా - సిద్దిపేట
మంత్రివర్గ విస్తరణలో తమ నేతలకు అవకాశం రాలేదని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్, సంగారెడ్డిలో గులాబీనేతలు పార్టీ పదవులకు రాజీనామా చేశారు.
తెరాస కౌన్సిలర్ల రాజీనామా
కేబినెట్ విస్తరణలో హరీశ్ రావు పేరు లేకపోవడం ఆయన నియోజకవర్గం సిద్దిపేటతో పాటు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. సిద్దిపేటలో ఆయన అభిమానులు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ పట్టణ కౌన్సిలర్ భవాని రాజీనామా చేశారు. పత్రాన్ని పురపాలక సంఘం కమిషనర్‌కు అందించారు.
మరోవైపు మాజీమంత్రి జోగురామన్న అనుచరులు సైతం నిరసన గళం వినిపించారు. ఆదిలాబాద్ లో జనగం దంపతులు తమ పదవులను త్యజించారు. తెరాస జిల్లా ఉపాధ్యక్ష పదవి నుంచి జనగం సంతోష్, ఆయన సతీమణి సంగీత మున్సిపల్ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు.
sample description