ETV Bharat / state

నిండు గర్భిణిని చిదిమేసిన లారీ.. కడుపులోంచి బయట పడ్డ శిశువు - Road Accident

మరికొన్ని రోజుల్లో ఆ ఇంట్లోకి వారసుడు రాబోతున్నాడు. బిడ్డకు జన్మనివ్వబోతున్నానని నెలలు నిండిన ఆ మహిళ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకొని.. ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా లారీ రూపంలో మృత్యువు ఆ గర్భిణిని పొట్టనబెట్టుకుంది.

9-months-pregnant-woman-dies-in-road-accident-in-khammam-district
లారీ ఢీకొని 9 నెలల గర్భిణి మృతి
author img

By

Published : Feb 12, 2020, 5:57 PM IST

Updated : Feb 13, 2020, 8:17 AM IST

లారీ ఢీకొని 9 నెలల గర్భిణి మృతి

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రాంచందర్‌రావు బంజర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నిండు గర్భణి, ఆమె కడుపులో ఉన్న శిశువు మృతి చెందారు.

అసలేం జరిగిందంటే?

పెనుబల్లి మండలం రాంచందర్‌రావు బంజర్‌కు చెందిన మురళి... అతని భార్య కల్యాణి 9 నెలల గర్భవతి కావడం వల్ల ఆసుపత్రిలో పరీక్షలు చేయించాడు. తిరిగి ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తుండగా... వెనక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. మహిళ కింద పడిపోవడం వల్ల ఆమె పైనుంచి లారీ వెళ్లింది. ఈ ఘటనలో అక్కడికక్కడే మృతి చెందింది. గర్భిణి చనిపోవడం వల్ల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.

ఇదీ చదవండి : దినదినగండం.. మృత్యువుతో పోరాటం

Last Updated : Feb 13, 2020, 8:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.