సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి మంజూరైన జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను పెన్పహడ్ మండలం దోసపాడు గ్రామానికి మార్చే ప్రయత్నాన్ని విరమించుకోవాలని తెలంగాణ సామాజిక న్యాయవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు జ్ఞానసుందర్ అన్నారు. తుంగతుర్తిలో సరైన భవనం, రవాణా సౌకర్యం లేదనే సాకుతో మార్చడం సరికాదని తెలిపారు. గతంలో అర్వపల్లికి మంజూరైన సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలను బాలెంల గ్రామానికి తరలించారని, నాగారంలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలను చివ్వెంల మండల కేంద్రానికి తరలించారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి తరలిస్తుంటే ప్రజలు చూస్తూ.. ఊరుకోరని హెచ్చరించారు.
అన్నీ తరలిస్తుంటే చూస్తూ ఊరుకోం - School
తుంగతుర్తికి ప్రభుత్వం కేటాయించిన సౌకర్యాలను వేరే గ్రామాలకు తరలిస్తే ఊరుకోమని హెచ్చరించారు తెలంగాణ సామాజిక న్యాయవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు జ్ఞానసుందర్.