ETV Bharat / state

వారికి కరోనా భయం.. వీరికి చేపలు దొరకవని ఆందోళన - ENUBAAMULA

సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని ఏనుబాముల గ్రామంలో చేపల కోసం లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. మత్స్య సంపద కోసం గ్రామస్థులు చెరువులపై ఎగబడుతున్నారు. లాక్​డౌన్​ను కొందరు వ్యక్తులు ఉల్లంఘిస్తుండగా అది అందరి ప్రాణాలకు ముప్పుగా మారే ప్రమాదం పొంచి ఉందని గ్రామీణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చేపల కొనుగోళ్లలో భౌతిక దూరమెక్కడ ?
చేపల కొనుగోళ్లలో భౌతిక దూరమెక్కడ ?
author img

By

Published : Apr 26, 2020, 11:47 PM IST

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం ఏనుబాముల గ్రామంలోని ముత్యాలమ్మ కుంటలో ఉదయం చేపలు పట్టారు. గ్రామ పంచాయతీలోని కొందరు వార్డు మెంబర్లు, ఎంపీటీసీ భర్త నాయకత్వంలో మత్స్య సొసైటీ సభ్యులతో కలిసి చెరువులోకి దిగారు. చేపలు పడుతున్నారన్న విషయం తెలుసుకున్న గ్రామస్థులు చేపల కోసం చెరువు దారి పట్టారు. ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన ప్రజలు చేపల కోసం భౌతిక దూరానికి ఎగనామం పెట్టారు.

ఇదీ చాలదన్నట్లు కుంటలో పట్టిన చేపలను గ్రామంలోకి తీసుకువచ్చి విక్రయించారు. వాటిని కొనుగోలు చేసేందుకు గ్రామస్థులు ఒక్క చోటకు చేరారు. చేపల కొనుగోలుకు వరుసలో నిల్చున్నప్పటికీ, మాస్కులు కట్టుకోకుండా భౌతిక దూరం పాటించకుండా ఎగబడ్డారు. ఈ క్రమంలో చేపల కోరుకునే వాళ్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా వ్యాధి విస్త్రృతంగా వ్యాపించి ప్రాణం మీదకు వచ్చే అవకాశం ఉంది.

చేపల కొనుగోళ్లలో భౌతిక దూరమెక్కడ ?

ఇవీ చూడండి : ఇంకొంత కాలం లాక్​డౌన్ కొనసాగిస్తే మనం సేఫ్ : కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.