సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలో శ్రీపురంలో.. శ్రీ అఖండ జ్యోతి స్వరూప సూర్య క్షేత్రంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. భువనేశ్వరి పీఠాధిపతి ఆనందభారతి, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపనందేంద్ర స్వామీజీలు యంత్ర ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్, సూర్యాపేట జడ్పీ ఛైర్పర్సన్ గుజ్జ దీపిక స్వామివారికి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంత్రి అభినందనలు..
సొంత ఖర్చులతో ఆలయాన్ని నిర్మించిన జనార్దన్ రెడ్డికి, మంత్రి జగదీశ్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.
ఆలయ ప్రత్యేకత:
దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి ద్వాదశ ఆదిత్య అఖండ జ్యోతి స్వరూప శ్రీ సూర్య క్షేత్రం తిమ్మాపురం గ్రామంలో నిర్మించారు. భారతదేశంలో ద్వాదశ సూర్య క్షేత్రం కాశీలో మాత్రమే ఉంది. ఆ తర్వాత ఇక్కడే రూపుదిద్దుకుంది. ఈ ప్రాంతంలో త్రిమూర్తుల రూపంలో ఆలయ పరిసరాల్లో ఉన్న మూడు కొండలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ అధికంగా ఉన్నట్లు మేధావులు గుర్తించారని తెలిపారు.
ఇవీ చూడండి: బాసర సరస్వతి ఆలయంలో దుకాణాలకు టెండర్లు