సుర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం తమ్మారంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోడ కూలి 2 ఆవులు మృతి చెందాయి. పాత కాలం నాటి గోడలు కావటం వల్ల కూలిపోయాయని స్థానికులు తెలిపారు.
వ్యవసాయానికి ఉపయోగపడేవి..
ఆవులు వ్యవసాయ పనుల్లో సహకారం అందించేవని యజమాని పేర్కొన్నారు. వాటి ఆకాల మృతిపట్ల ఆవుల యజమాని ఆందోళ వ్యక్తం చేశారు.