క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తిరుమలగిరి మున్సిపల్ వాసిని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పరామర్శించారు. రూ. 50వేల రూపాయల ఆర్ధిక సాయం అందజేశారు. బాలునికి మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు.
తిరుమలగిరి పరిధిలోని అనంతారానికి చెందిన శాగంటి అయోద్య, సైదమ్మ దంపతుల కుమారుడు గౌతమ్ గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. పరీక్షలు చేయించడానికి రూ. 5 లక్షలు అవసరం అవుతాయని వైద్యులు తెలిపారు. అంతడబ్బు లేకపోవడంతో ఎవరైన తమ కుమారున్ని ఆదుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న గాదరి కిషోర్ బాధిత కుటుంబాన్ని కలిసి ఆర్ధికసాయం చేశారు.
ఇదీ చదవండి:'సీమ ఓబులమ్మ'గా రకుల్‌ప్రీత్ సింగ్!