సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో వైభవంగా జరుగుతోన్న జాన్‌పహాడ్ ఉర్సు ఉత్సవాల్లో ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ పాల్గొన్నారు. స్వామివారికి గంధాన్ని సమర్పించి.. మొక్కులు చెల్లించుకున్నారు.
ఎంపీతో పాటు హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరమూర్తి లింగయ్య, కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్‌లు ఈ వేడుకలకు హాజరయ్యారు.
జాన్‌పహాడ్ సైదులు స్వామివారి దయతో అందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి. సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్వర్ రెడ్డిల నేతృత్వంలో దర్గా అభివృద్ధికి మరింత కృషి చేస్తాం.
- ఎంపీ బడుగు లింగయ్య యాదవ్
నియోజకవర్గ ప్రజలందరిపై స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఎమ్మెల్యేలు కోరారు. కులమతాలకు అతీతంగా.. భక్తులు భారీ స్థాయిలో తరలిరావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఇదీ చదవండి: మేడారం చిన్న జాతరకు సన్నాహకాలు..!