Temperature in TS: రాష్ట్రంలో భానుడు భగభగలు ఇంకా తగ్గడం లేదు. పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లలేక ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప.. ప్రయాణాలకూ దూరంగానే ఉంటున్నారు. తాజాగా సూర్యాపేట, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లోని పలు మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇలా..: సూర్యాపేట జిల్లా మునగాల, ఖమ్మం జిల్లా మధిర, చింతకాని, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలాల్లో అత్యధికంగా 44.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలోని రావినూతలలోనూ 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది.
హైదరాబాద్లో వర్షం: ఒకవైపు ఎండలు దంచికొడుతుంటే.. మరోవైపు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఇవాళ వర్షం కురిసింది. గచ్చిబౌలి, సరూర్నగర్, నాంపల్లి, అంబర్పేట్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన దంచికొట్టింది.
ఇవీ చూడండి: రెండు, మూడు నెలల్లో సంచలన వార్త చెప్తా..: సీఎం కేసీఆర్