సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కిరాణా దుకాణం, బియ్యం షాపుల్లో అక్రమంగా నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ డేనియల్ కుమార్ తన సిబ్బందితో వెళ్లి ఆకస్మిక తనిఖీ చేశారు.
సుమారు 9వేల విలువ గల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. దుకాణం యజమాని గంజి శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
- ఇదీ చూడండి : ఖరీదైన 'వైద్యం'.. కనుమరుగవుతున్న 'ఆరోగ్యం'