ETV Bharat / state

పాపం: అమ్మ కూలీపని... ఊయలలో చంటిబిడ్డ

మూడు నెలల ఆ పాపాయికి చుట్టూ ఉన్న చెట్లే జోలపాటలు పాడుతున్నాయి. పచ్చని ప్రకృతిని చూస్తూ మూడు కర్రల ఊయలలో హాయిగా ఆ చంటిబిడ్డ ఆడుకుంటోంది. రోజుకొకరి పొలంలో అమ్మ కూలీ పనులు చేస్తుండగా బోసి నవ్వుల పాపాయి ఊయలు ఊగుతోంది. అమాయకంగా ఆడుకుంటున్న ఆ పాపాయిని చూసి స్థానికులు అయ్యో పాపం అంటున్నారు.

three-months-baby-in-crops-while-mother-doing-labor-work-in-fields-at-thungathurthy-in-suryapet
పాపం: అమ్మ కూలీపని... ఊయలలో చంటిబిడ్డ
author img

By

Published : Dec 25, 2020, 10:45 AM IST

బతుకుదెరువు కోసం రాష్ట్రం దాటి వచ్చారు ఆ దంపతులు. చంటిబిడ్డతో సహా కూలీకి పోతూ కాలం వెల్లదీస్తున్నారు. చలికాలంలోనూ మూడు నెలల పాపాయిని తీసుకొని పత్తి, మిరుప తోటల్లో పనిచేస్తున్నారు. మూడు కర్రలతో ఏర్పాటు చేసిన ఊయలలో బోసి నవ్వులతో ఆడుకుంటున్న చిన్నారి... అమ్మ కోసం సాయంత్రం దాకా ఎదురు చూస్తూ ఆడుకోవడం స్థానికులని కలచివేస్తుంది.

three-months-baby-in-crops-while-mother-doing-labor-work-in-fields-at-thungathurthy-in-suryapet
పాపం: అమ్మ కూలీపని... ఊయలలో చంటిబిడ్డ

కర్నూలు జిల్లాకు చెందిన కూలీలు ఉపాధి కోసం రెండు నెలల కిందట సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలానికి వచ్చారు. మండల పరిధిలో పత్తి, మిరుప తోటల్లో కూలీకి పోతూ... కాలం వెల్లదీస్తున్నారు. వారిలో జ్యోతి, గంగాధర్ దంపతులకు మూడు నెలల పసిపాప ఉంది. బతుకుదెరువు కోసం వచ్చిన ఆ దంపతులు తప్పని పరిస్థితుల్లో చిన్నారిని తోటలకు తీసుకెళ్తున్నారు. పొలంలో మూడు కర్రల సాయంతో ఊయల ఏర్పాటు చేసి పనులు చేసుకుంటున్నారు.

ఎవరి పొలంలోకి వెళ్లినా మూడు కర్రల సాయంతో ఊయల ఏర్పాటు చేసి... పాపని ఆడించడానికి బంధువుల పాపని ఉంచారు. పొలంలో అమ్మ కూలీపని చేస్తుండగా... ఊయలలో చిన్నారి ఆడుకోవడాన్ని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. పొలాల్లో ఊయల ఊగుతున్న చంటిబిడ్డని చూసి అయ్యో పాపం అంటున్నారు.

ఇదీ చదవండి: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. శ్రీవారి సేవలో ప్రముఖులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.