సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండ రామారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా కేసులు.. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పాఠశాలలోని ఇద్దరు విద్యార్థులు, ఓ ఉపాధ్యాయురాలికి కొవిడ్ సోకింది.
బుధవారం.. పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయురాలికి కరోనా నిర్ధరణ అయింది. దీంతో ఈ రోజు వైద్య సిబ్బంది బడిలోని 45 మంది విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. పదోతరగతి విద్యార్థి, ఏడో తరగతి విద్యార్థినికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
పాఠశాలలోని ఇద్దరు విద్యార్థులకు వైరస్ సోకడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. సెప్టెంబరు 1 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కావడంతో ఆందోళనతోనే తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపించారు. ఈ నేపథ్యంలో తాజాగా కొవిడ్ కేసులు నమోదు కావడం వారిలో భయాన్ని మరింత పెంచాయి.
ఇదీ చదవండి: NIRF: టాప్ టెన్ విద్యాసంస్థల్లో తెలంగాణ నుంచి ఒకే ఒక్కటి