ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఎన్నికల ప్రచార సభకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటల తర్వాత నియోజకవర్గ కేంద్రానికి చేరుకోనున్నారు. పట్టణ శివారులో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. బుధవారం ఉదయం 11 గంటల తర్వాత సీఎం పర్యటన ఖరారైన నేపథ్యంలో ఆగమేఘాల మీద అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఎన్నికల వ్యయ పరిమితి మించిపోతుందన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రాక నిర్ణయాన్ని చివరి నిమిషం వరకు తేల్చలేదని సమాచారం. అయితే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని స్వయంగా ముఖ్యమంత్రే జిల్లా నేతలకు సమాచారం అందించారని తెలుస్తోంది. సూర్యాపేట జిల్లా ఎస్పీ భాస్కరన్, నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఇదీ చూడండి : విధానపరమైన నిర్ణయాల్లో జోక్యమేలా..?