సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీపీఎం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నాయకులతో సమావేశమయ్యారు. చైనా – భారత్ సరిహద్దుల్లో మరణించిన అమరవీరులకు, సూర్యాపేటకు చెందిన కర్నల్ సంతోష్ బాబుకు సంతాపం ప్రకటించారు. భారత్- చైనా వివాదం విషయంలో వాస్తవాలు జనాలకు తెలియజేయడంలో ప్రధానిగా మోదీ విఫలమయ్యారని విమర్శించారు.
ఒకవైపు సైనికులు భారత భూభాగాన్ని అక్రమించారని అంటుంటే ప్రధాని మాత్రం ఆక్రమణకు గురికాలేదంటూ తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. దేశంలో ప్రతి రోజు దాదాపు 15వేల కరోనా కేసులు నమోదవుతున్నాయని...ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో ఆరోగ్య వ్యవస్థ బలహీనంగా ఉందని ఆరోపించారు. రాష్ట్రం విషయానికి వస్తే.. సీఎం కేసీఆర్ చెప్పేమాటలకు.. చేసే పనులకు పొంతనలేదని విమర్శించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రతి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కరోనా పరీక్షలు నిర్వహిస్తామని అన్నారని.. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎంతవరకు కరెక్టుగా ఉన్నాయని ప్రశ్నించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రభుత్వం నిర్వహించిన ధరలకు కరోనా పరీక్షలు ఎంతవరకు జరుగుతున్నాయని.. లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారు ఆరోపించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25వేల డాక్టర్, నర్సుల పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్