ETV Bharat / state

Kodandaram on TJS Merging : 'అవసరమైతే వేరే పార్టీలో విలీనం చేస్తా' - తెలంగాణ జన సమితి మూడవ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు

Telangana Jana Samithi Plenary Meeting In Suryapet : ప్రజాస్వామ్య తెలంగాణ లక్ష్యంగా ప్రజల ఆకాంక్షల మేరకు వచ్చే ఎన్నికల్లో విపక్షాలు ఐక్యంగా కలిసి పనిచేయాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వ విధానాలకు పాల్పడుతోందని విమర్శించారు. విపక్షాలను ఏకం చేస్తారంటున్న మీరు టీజేఎస్ ను కాంగ్రెస్​లో విలీనం చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయని మీడియా ప్రశ్నించగా.. ప్రజల ఆకాంక్షలను అమలు చేసేందుకు ఏం చేసేందుకైనా సిద్ధమని అన్నారు.

Telangana Jana Samithi Plenary Meeting
Telangana Jana Samithi Plenary Meeting
author img

By

Published : Jun 5, 2023, 7:29 AM IST

Updated : Jun 5, 2023, 7:47 AM IST

'అవసరమైతే వేరే పార్టీలో విలీనం చేస్తా'

Kodandaram On Telangana Government : సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ జన సమితి మూడవ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా టీజేఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. టీజేఎస్ జెండా ఆవిష్కరించిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఆకాంక్షలను తుంగలో తొక్కి తెలంగాణ పేరును కూడా మార్చుకున్న అధికారపార్టీ బీఆర్ఎస్​గా మారిందని కోదండరాం ఆరోపించారు. వారి తక్షణ ఆర్ధిక రాజకీయ ప్రయోజనాల కోసమే తొమ్మిదేళ్లుగా పరిపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.

Kodandaram on TJS Merging : ప్రజల సమస్యలు ఎక్కడికక్కడే ఉన్న నేపథ్యంలో ఉద్యమ ఆకాంక్షల సాధన, తెలంగాణ పరిరక్షణ కోసం విపక్షాలన్నీ సంఘటితం కావలసిన అవసరం ఉందని కోదండరాం అన్నారు. ఉద్యమ ఆకాంక్షల నేరవేర్చడానికి ఒక వేదిక అవసరం ఏర్పడిందని తెలిపారు. ఇదే సమయంలో టీజేఎస్ ప్లీనరీ ఉండటంతో తెలంగాణ శక్తులను ఐక్యం చేసే వ్యూహ రచనతో పాటు జన సమితి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తామని వెల్లడించారు.

'తెలంగాణ జన సమితి మూడో ప్లీనరీ సమావేశాలు ఇప్పుడు జరుగుతున్నాయి. మధ్యలో కొవిడ్ కారణంగా రెండు ప్లీనరీలు జరగలేదు. ఈ ప్లీనరీ చాలా కీలమైన సమయంలో జరుగుతోంది. ఒకవైపు ఎన్నికలు రాబోతున్నాయి. మరోవైపు రాష్ట్ర ఆకాంక్షలను తుంగలో తొక్కి తెలంగాణ పేరును కూడా వదులుకొని అధికారపార్టీ భారత్ రాష్ట్ర సమితిగా మారిన సందర్భం చూస్తున్నాం'. - కోదండరాం, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు

Third State Plenary Sessions of Telangana Jana Samithi : ప్రజాస్వామిక తెలంగాణ కాంక్షించే ప్రయత్నంలో ఉమ్మడి కార్యచరణ కోరుకుంటే ఐక్యత సాధ్యమవుతుందన్న కోదండరాం.. తెలంగాణ మేధావులు కూడా కలిసి వచ్చి ఐక్యతకు తోడ్పాటు కల్పించాలని కోరారు. ఎన్నికల కోసం కాకుండా ప్రజాస్వామిక తెలంగాణ ప్రాతిపదికన మీద ఐక్యత కావాలని ఆకాక్షించారు. తెలంగాణ నిరంకుశ పాలన అంతిమ లక్ష్యమన్న కోదండరాం.. దాని తర్వాతే ఎన్నికలైనా.. పదవులైనా అని అన్నారు. కాంగ్రెస్​లో విలీనం చేస్తారన్న ఊహాగానాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు అవసరమైతే ఏం చేయడానికైనా సిద్ధమేమని కోదండరాం వెల్లడించారు.

'ఈ సందర్భంలో చాలా కీలకమైన విషయాలపై తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవాళ విద్యవైద్యం దక్కలేదని, చిన్న సన్న కౌలు రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు మార్కెట్​లో దోపిడీ, అకాల వర్షాల వల్ల కారణంగా పంటనష్టం, పోడు రైతులకు పట్టాలు ఇవ్వకపోవడం, ఇలాంటి అనేక సమస్యలపైన తెలంగాణ ప్రజలు ప్రభుత్వ సాయం లేక బాధపడుతున్నారు'. -కో దండరాం, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు

ఇవీ చదవండి:

Last Updated : Jun 5, 2023, 7:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.