Telangana Assembly Elections 2023 : నవంబర్ 30న రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో 70 పైగా స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఐసీసీ, పీసీసీ ఎన్నికల కమిటీల ఆమోదంతో తాను హుజూర్నగర్ నుంచి పోటీ చేస్తారని స్పష్టం చేశారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. 70 స్థానాలు పైగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలకు 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీనే నెగ్గుతుందని ధీమా వ్యక్తం చేశారు. కోదాడ, హుజుర్నగర్ నియోజకవర్గంలో 50వేల మెజారిటీతో గెలుస్తారని జోస్యం చెప్పారు.
Unemployment Benefit Scheme not Introduced in Telangana : రాష్ట్రంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద మరింత ఎక్కువగా ఉందని ఆరోపించారు. ఎన్నికల దృష్ట్యా తాను సొంతంగా సర్వే నిర్వహించారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో వాటిని నెరవేర్చలేదని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి(Nirudyoga Bruthi) 2018లో ప్రకటించి నాలుగున్నర సంవత్సరాలుగా ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని విమర్శించారు. ఆ బకాయిలను ఇచ్చి నిరుద్యోగులను ఓట్లు అడగాలని అన్నారు.
'గిరిజన గ్రామాలకు నిధులు, నీళ్లు ఇవ్వడంలో సీఎం కేసీఆర్ విఫలం'
Uttam Kumar Reddy Comments on KCR : దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూమిని మోసం చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని అన్నారు. ముదిరాజులకు 119 నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదని.. మాదిగలికి మంత్రివర్గంలో స్థానం లేదని ముస్లింలకి 12% రిజర్వేషన్ కల్పించకుండా గొడవలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు డబ్బు సంపాదించాలనే ఆలోచన తప్ప.. నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"పోలీసులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని బెదిరిస్తున్నారు. వైన్ షాపుల దందాలు.. ఇలానే ప్రతి పనిలో కమిషన్లు తీసుకుంటూ ఎమ్మెల్యేలు అరాచకాలు చేస్తున్నారు. వీటన్నింటిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు.. ఎన్నికల్లో సరైన బుద్ధి చెబుతారు. అక్టోబర్ 6న రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తోంది.. నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. నేను హుజూర్నగర్ నుంచి పోటీ చేస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో 70 స్థానాలకి పైగా గెలుస్తాం. నల్గొండలో ఉన్న 12 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. కేసీఆర్ పాలనపై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు. నేను సొంతంగా సర్వే నిర్వహించాను. "- ఉత్తమ్‌కుమార్ రెడ్డి, హుజుర్నగర్ ఎంపీ
ఈ నెలాఖరులో శాసనసభ రద్దు.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన: ఉత్తమ్ కుమార్‌రెడ్డి
Congress: 'రాహుల్ క్షేత్రస్థాయిలో ప్రజలను కలుస్తుంటే.. బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది'