సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కు చెందిన సుశీలమ్మకు భజనలన్నా, సంకీర్తనలన్నా ఎనలేని ప్రేమ. వాటిపై మక్కువతో 2008లో శ్రీ గోదాసేవ తరంగిణి పేరిట కోలాట భజన బృందాన్ని ఏర్పాటు చేశారు. కాశీ, శిరిడీ, అహోబిలంలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు.
2017లో శ్రీ అన్నమయ్య భజన బృందానికి గౌరవ సలహాదారులుగా చేరి తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నమయ్య భజన మండలి ఆధ్వర్యంలో పేద గర్భిణీలకు సామూహిక సీమంతాలు చేశారు.
కళా రంగానికి ఎనలేని సేవ చేసిన స్వర్గీయ శ్రీమతి జమలాపురం సక్కుబాయి గారి స్మారకార్థం భక్తి భజన సంకీర్తన ప్రచార పరిషత్ మాస పత్రిక హైదరాబాద్ ఆధ్వర్యంలో భజన, సంకీర్తన రంగంలో విశేష సేవలు అందించిన మహిళా మణులకు పురస్కారాలు అందజేస్తోంది. ఎంతో మంది పేద గర్భిణీలకు తల్లిలా సీమంతం జరిపించిన సుశీలమ్మను ఆ పరిషత్ జీవిత సాఫల్య పురస్కారంతో గౌరవించనుంది. ఈ నెల 10న బొగ్గులకుంటలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి చేతుల మీదుగా సుశీలమ్మ అవార్డు అందుకోనున్నారు.
- ఇదీ చదవండి : 4వ తరగతి పాసైన బామ్మలకు.. నారీశక్తి పురస్కారం