ETV Bharat / state

ప్రైవేటు ల్యాబుల్లో డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీ

author img

By

Published : Aug 27, 2020, 9:54 AM IST

హుజూర్ నగర్‌లోని రెండు ప్రైవేటు ల్యాబ్‌లను జిల్లా డీఎంహెచ్‌వో డా. కర్పూరం హర్షవర్ధన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనుమతి లేకుండా ల్యాబ్‌లను నడిపినా, కొవిడ్ పరీక్షలు నిర్వహించిన చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. అధిక ఫీజులు వసూలు చేసినా, తగు అర్హతలు లేని వారు పరీక్షలు చేసినా చట్టరీత్యా చర్యలు ఉంటాయని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ నిరంజన్ తెలిపారు.

ప్రైవేటు ల్యాబుల్లో డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీ
ప్రైవేటు ల్యాబుల్లో డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీ

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లోని రెండు ప్రైవేటు ల్యాబ్‌లను జిల్లా డీఎంహెచ్‌వో డా. కర్పూరం హర్షవర్ధన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల రెండు ప్రైవేటు ల్యాబ్‌లపై కొవిడ్ పరీక్షలు నిర్వహించి అమాయకులను మోసం చేసి డబ్బులు గుంజుతున్నారన్న కథనాలకు స్పందించి.. ఆ రెండు ల్యాబ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు.

కరోనా పరీక్షలు నిర్వహించారా లేదా అనే విషయాలపై ఆరా తీశారు. బాధితులతో ఫోన్‌లో సంప్రదించి.. వారు కేసు పెట్టిన స్థానిక పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఎస్సై ద్వారా కేసు పూర్వాపరాలు తెలుసుకున్నారు. పూర్తి విచారణ జరిగిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామని, అలాగే అనుమతి లేకుండా ల్యాబ్‌లను నడిపినా, కొవిడ్ పరీక్షలు నిర్వహించిన చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. నిబంధనలకు వ్యతిరేకంగా పరీక్షలు నిర్వహించినా, అధిక ఫీజులు వసూలు చేసినా, తగు అర్హతలు లేని వారు పరీక్షలు చేసినా చట్టరీత్యా చర్యలు ఉంటాయని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ నిరంజన్ తెలిపారు.

ఇదీ చూడండి : వీసీల నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.