ETV Bharat / state

అభివృద్ధి చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా.. లేదంటే..!

author img

By

Published : Nov 3, 2020, 8:01 PM IST

హుజూర్​నగర్​ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిపై సూర్యాపేట జిల్లా భాజపా అధ్యక్షుడు బోబ్బా భాగ్యరెడ్డి మండిపడ్డారు. నియోజకవర్గంలో రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేశానంటున్న ఎమ్మెల్యే మాటల్లో వాస్తవం లేదంటూ ఆరోపించారు. పనులు చేశానంటూ గొప్పలు చెప్పడం కాదని.. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్​ విసిరారు.

అభివృద్ధి చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా.. లేదంటే..!
అభివృద్ధి చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా.. లేదంటే..!

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ నియోజకవర్గంలో భాజపా, తెరాస నేతల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ హుజూర్​నగర్​ ఉప ఎన్నికల్లో తెరాస గెలిచి ఏడాది గడిచినా.. అభివృద్ధి శూన్యం అని విమర్శించడంతో ఎమ్మెల్యే సైదిరెడ్డి... బండి సంజయ్​పై మండిపడ్డారు. నియోజకవర్గంలో రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా భాజపా అధ్యక్షుడు బోబ్బా భాగ్యరెడ్డి.... ఎమ్మెల్యే సైదిరెడ్డిపై నిప్పులు చెరిగారు. సైదిరెడ్డి మాటల్లో నిజం లేదంటూ కొట్టిపారేశారు. ఎమ్మెల్యే చెప్పినట్లుగా చింతలపాలెం మండలంలో రూ.25 కోట్లతో లిఫ్టులు అభివృద్ధి చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా.. లేకుంటే నువ్వు ముక్కు నేలకు రాస్తావా అంటూ ధ్వజమెత్తారు.

ఎమ్మెల్యే సొంత మండలం మఠంపల్లిలోని పెడవీడు రెవెన్యూలోని 540 సర్వే నంబర్​లో గిరిజనుల భూములు ఆక్రమిస్తూ.. గిరిజనులపై అక్రమ కేసులు పెట్టించలేదా అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. 2017లో ఈఎస్​ఐ 30 పడకల ఆస్పత్రి మంజూరు చేయిస్తే.. తెరాస ప్రభుత్వం స్థలం కూడా కేటాయించలేదంటూ మండిపడ్డారు. నియోజకవర్గంలో 85 శాతం పనులు పూర్తి చేశానని గొప్పలు చెప్పడం కాదు.. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలంటూ ఎమ్మెల్యేకు సవాల్​ విసిరారు.

ఇదీ చూడండి.. కారు దొంగతనం కేసులో మాజీ ఎమ్మెల్యేపై చీటింగ్​ కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.