ETV Bharat / state

సూర్యాపేటకు ఎఫ్​ఎం సేవలు అందేదెప్పుడు..? - RADUO STATION

గత పదేళ్లుగా ఎఫ్​ఎం వినాలని ఉబలాటపడుతున్న సూర్యాపేట జిల్లావాసులకు నిరాశే మిగులుతోంది. జిల్లా కేంద్రంలో పూర్తిస్థాయిలో  సేవలు అందేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. గుడ్డిలో మెల్ల నయమన్నట్లుగా... పరిసర ప్రాంతాలకు సేవలందించేందుకు మాత్రం ట్రాన్స్​మీటర్ సామర్థ్యాన్ని పెంచారు. దీని ద్వారా గురువారం నుంచి 30 కి.మీ మేర నాణ్యమైన ప్రసారాలు అందుతున్నాయి.

సూర్యాపేటకు ఎఫ్​ఎం సేవలు అందేదెప్పుడు..?
author img

By

Published : Aug 2, 2019, 3:44 PM IST

సూర్యాపేటకు ఎఫ్​ఎం సేవలు అందేదెప్పుడు..?

హాయ్, హలో, వినండి, వినండి... మీ ఎఫ్​ఎం అంటూ శ్రోతలను పలకరించే ఎఫ్ఎం రేడియో సేవలు సూర్యాపేట జిల్లా వాసులకు అందించడంలో పదేళ్లుగా జాప్యం జరుగుతూనే ఉంది. నిధుల లేమితో రేడియో స్టేషన్​ పనులు మూడడుగులు ముందుకు... ఏడడుగులు వెనక్కి అన్న విధంగా సాగుతున్నాయి. పూర్తిస్థాయిలో సేవలు అందాలంటే మరో ఏడాదిన్నర పాటు ఎదురుచూడాల్సిందేనంటున్నారు అధికారులు.

అరకొర నిధుల వల్లే పనుల్లో జాప్యం

హైదరాబాద్ - విజయవాడ మధ్యలో రేడియో ప్రసారాలు అందడం కష్టంగా మారడం వల్ల సూర్యాపేట జిల్లాలో ఎఫ్ఎం రేడియో స్టేషన్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే పనులు ప్రారంభించాలంటూ అధికారులను అప్పటి కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి జైపాల్ రెడ్డి ఆదేశించారు. అరకొర నిధులు కేటాయించడం వల్ల పనుల్లో విపరీత జాప్యం నెలకొంది. తర్వాత ప్రభుత్వం మారడం, పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం వల్ల పనులు ఏళ్లకు ఏళ్లుగా జరుగుతూనే ఉన్నాయి.

30 కిలోమీటర్ల మేర నాణ్యమైన ప్రసారాలు

ఇప్పటి వరకు సూర్యాపేటకు 30 కిలో మీటర్ల మేర నాణ్యమైన ప్రసారాలు అందేందుకు పనులు పూర్తి చేశారు. 10 కిలో వాట్స్ రేడియో స్టేషన్ పనులకు గానూ ఆరు నెలల క్రితం తొలిదశలో 1 కిలో వాట్ సామర్థ్యంతో ప్రసారాలను ప్రారంభించారు. ఈ నెల ఒకటిన దీనిని 2.05కిలో వాట్స్ సామర్థ్యానికి పెంచారు. ఫలితంగా 8 కిలో మీటర్ల రేంజ్ నుంచి 30 కిలోమీటర్ల దూరం వరకు నాణ్యమైన ప్రసారాలు అందుతున్నాయి. ప్రస్తుతం 101 కిలో హెడ్జ్ ఫ్రీక్వెన్సీ వల్ల అందీ అందనట్లు వచ్చే ప్రసారాలు ప్రస్తుతం స్పష్టంగా వస్తున్నాయి. గతంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వచ్చే ప్రసారాలు, ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వినొచ్చు.

100 కి.మీల మేర ప్రసారాలు రావాలంటే...

సూర్యాపేట రేడియో స్టేషన్​కు టవర్ పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తేనే సామర్థ్యం పది కిలో వాట్స్​కు పెరుగుతుంది. అప్పుడే 100 కిలోమీటర్ల మేరకు ప్రసారాలు అందుతాయి. అప్పటివరకు ఇదే పరిస్థితి.

ఇవీ చూడండి: ఆగస్టు 6 నుంచి అయోధ్యపై రోజువారీ విచారణ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.